Farmers : రైతులు బాతులు పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి.
రైతులు బాతులు పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పాతూరు గ్రామంలో రైతులు చేపలు పెంపకం చేపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా దుమ్ముగూడెం లోని రైతులు బాతులు పెంపకం ద్వారా మంచి లాభాలను గడిస్తున్నారని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు బాతులు పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. రైతులు రుణమాఫీ ద్వారా వచ్చిన డబ్బుతో పొలాన్ని సారవంతంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మన జిల్లాలో రైతుబిడ్డ అంతర పంటలు చేపలు మరియు బాతులు పెంపకం తదితర పంటల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు అని తెలిపారు.రైతులు ధైర్యం చేసి వినూత్న పంటల వైపు అడుగు వేయాలని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీలో ఎటువంటి సమస్య వచ్చినా బ్యాంకర్లు ఏ ఈ ఓ కు తెలియజేయాలని వారు వెంటనే సమస్యను జిల్లా కార్యాలయానికి తెలియజేసి పరిష్కరించాలని ఆదేశించారు.
రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలను వినియోగించుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, రైతులకు ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వ యంత్రాంగం మరియు అధికారులు అన్నివేళలా సిద్ధంగాఉంటారని తెలిపారు.అనంతరం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన రైతులకు కలెక్టర్ చెక్కులు అందించారు.