Badradrikothagudem

రైతులకు ఇబ్బందులు ఉండొద్దు

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు: జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర కుమార్

వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర కుమార్ ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి జిల్లా పౌరసరఫరాల సంస్థ మరియు శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్ లు, వ్యవసాయ, సహకార, డిఆర్డిఏ, తూనికలు కొలతలు రవాణా,మార్కెటింగ్ శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఈ వానకాల సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుందన్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలను కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్ లను, వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దనిఅధికారులకు సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని అన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని అధికారులకు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *