పోలీసులమని చెప్పిన నలుగురు వ్యక్తులను అరెస్టు
పోలీసులమని చెప్పిన నలుగురు వ్యక్తులను అరెస్టు
కొత్తగూడెంకు చెందిన విద్యార్థులైన ఆకాష్,తరుణ్ ,జస్వంత్ రాజు అను ముగ్గురు వ్యక్తులు రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ జంక్షన్ వద్ద నేషనల్ హైవే మెయిన్ రోడ్డు దగ్గర రీల్స్ తీస్తుంటే వారిని చూసిన పెనగడపకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వస్తూ వారిని బెదిరించి మేము పోలీసులమని చెప్పి,మీరు ఇక్కడ ఎందుకు ఫోటోలు దిగుతున్నారు.మీరు గంజాయి బ్యాచ్ అని అంటూ వారి యొక్క ఫోటోలు తీసి,పోలీసులమని బెదిరించి వారిని డబ్బులు గురించి భయపెట్టారు. బెదిరిస్తూ వారిని తీసిన ఫోటోలను డిలీట్ చేయడానికి డబ్బులు ఇస్తేనే డిలీట్ చేస్తామని అనడంతో వీరు ముగ్గురు వారి యొక్క ఐడి కార్డు చూపించండి అని అడగడంతో ఈ నలుగురు కారులో వచ్చిన వ్యక్తులు మమ్మల్ని ID card అడుగుతారా అంటూ వారిని కొట్టడం జరిగింది.
నిందితులు దాడి చేస్తుండగానే ఈ ముగ్గురు విద్యార్థులు అక్కడి నుండి పారిపోయారు.ఈ విషయంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి,విచారణ చేపట్టి నిన్న అనగా 06.08.2024ణ నిందితులైన నలుగురు పెనగడపకు చెందిన ఎస్కే యాకూబ్ గౌరీ, ఎగ్గడి అశోక్, వడ్డే మనోజ్ మరియు పులిచర్ల శరత్ చంద్ర లను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి కారు మరియు ఫొటోలు తీసిన సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకొవడం జరిగింది.
అదేవిధంగా విద్యార్థులు మరియు ఇతర వ్యక్తులు ఈ విధంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి ఫోటోషూట్స్,రీల్స్ లాంటివి తీసుకోవడం చేయకూడదని సీఐ రమేష్ తెలిపారు.రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావునా ఎవరూ కూడా రోడ్ల మీద మరియు నిర్మాణంలో ఉన్న ప్రదేశాలకు, ప్రమాధకరమైన వాగులు,నదులు, చెరువులు వద్దకు వెళ్లి ఫోటోలు దిగడం రీల్స్ చేయడం వంటివి చేయొద్దని కోరారు.