గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.
గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.
గణేష్ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను జిల్లా పోలీస్ శాఖ తరపున గణేష్ నవరాత్రి మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు.
గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని,ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణపోలీస్ శాఖఅధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి.గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి.వృద్ధులు,చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.