సమాజ సేవతోనే ఎనలేని సంతృప్తి
సమాజ సేవతోనే ఎనలేని సంతృప్తి
కరకగూడెం ఎస్సై. రాజేందర్
కరకగూడెం, ఆగస్టు 2 (శోధన న్యూస్ ): సమాజ సేవతోనే ఎనలేని సంతృప్తి దాగి ఉంటుందని ప్రతీ ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కరకగూడెం ఎస్సై రాజేందర్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో మండలంలోని పద్మాపురం అంగన్ వాడీ కేంద్రంలో ఆ కేంద్రం చిన్నారులతో పాటు మొగలితోగు,నీలాద్రిపేట వలస ఆదివాసీ చిన్నారులకు మొత్తం 60 మందికి స్కూల్ బ్యాగులు,పలకలు డ్రాయింగ్ కిట్స్,నోట్ పుస్తకాలను ఎస్సై చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఐదేండ్ల లోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్ వాడీ కేంద్రాల్లో వారి తల్లిదండ్రులు చేర్పించాలని పేర్కొన్నారు.చిన్నారులకు అట పాటలతో నాణ్యమైన విద్య అందించినప్పుడే వారు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.అంతేకాకుండా ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని ప్రసంసించారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్తలు ఈసం అనురాధ స్వర్ణలత,సుజాత గ్రామస్థులు పఠాన్ యాకుబ్ ఖాన్,ఈసం రాజబాబు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.