BadradrikothagudemTelangana

Cleanliness-Greenery : స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం అమలు

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం అమలు.

-జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశాంతి కుమారి.

ఈనెల 5 నుండి 9 వరకు అన్ని గ్రామాల్లో స్వచ్ఛదనం- పచ్చదనం అని పేరుతో గ్రామాల్లో పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్వచ్ఛ ధనం – పచ్చదనం కార్యక్రమం అమలుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలు రోజువారీ కార్యక్రమాలు తదితర అంశాలు కలెక్టర్లకు వివరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్  అధికారులతో స్వచ్ఛ ధనం – పచ్చదనం కార్యక్రమ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *