మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం
మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్
జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్, అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మన జిల్లాలో లోని రైతులు వరి, పత్తి మరియు మొక్కజొన్న పంటలు పండించడానికి ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఎకరానికి 20000 నుండి 30000 వరకు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుకుఅధిక లాభం పొందేలా మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేయవచ్చని తెలిపారు.
మునగ సాగు ఎందుకు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎండాకాలంలో పొలాలు ఖాళీగా ఉంటాయని ఇప్పుడు వచ్చిన పంట డబ్బులు నుంచి కేవలం 10000 రూపాయలు పెట్టుబడి ద్వారా అంటే 2000 రూపాయలు విత్తనాలు, 2000 రూపాయలు ప్లాస్టిక్ బ్యాగులకు ఇంకా మట్టి ఎరువులకు తదితర ఖర్చులకు ఈ పెట్టుబడే డబ్బులు కూడా రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా మొక్క పెట్టుబడి కింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎండాకాలంలో రైతులు పొలంలో ఖాళీగా ఉంచకుండా మునగ సాగు చేయాలని, దాని ద్వారా అధిక ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మునగ సాగు లో మునగ ఆకు పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం మార్కెట్లో మునగాకు పొడి ధర కేజీ వెయ్యి రూపాయలుగా ఉందని చెప్పారు.అదేవిధంగాఒకవేళ కాయలు పెద్దవిగా అయ్యి ఎండిపోయినప్పటికీ, ఆ గింజ ద్వారా వచ్చే నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని ప్రస్తుతం మార్కెట్లో లీటర్ మునగ నూనె ధర 3000 గా ఉందని, ఏ విధంగా చూసినప్పటికీ మునగ సాగు లాభదాయకమని అన్నారు. కేవలం 10000 రూపాయల పెట్టుబడితో 90 వేల నికర ఆదాయం, మళ్లీపెట్టుబడి 10000 ఉపాధి హామీ పథకం కిందతిరిగి వస్తుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.