సింగరేణి ఉద్యోగుల పని వేళల అమలుపై తనిఖీలు
సింగరేణి ఉద్యోగుల పని వేళల అమలుపై మణుగూరు ఏరియా సందర్శన .
తనిఖీలు నిర్వహించిన ఇంటర్నల్ ఆడిటింగ్ అధికారులు
సింగరేణి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యసాధన, ప్రైవేటు సంస్థలతో ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగల పని సంస్కృతి మెరుగుపరచడానికి సింగరేణి ఎండి బలరాం నాయక్ చేపడుతున్న చర్యలలో భాగంగా సింగరేణి ఇంటర్నల్ ఆడిటింగ్ అధికారులు శుక్రవారం ఉదయం మణుగూరు జిఎం కార్యాలయ సిబ్బంది రాకపోకలపై ముందుగా నిఘా పెట్టారు, నిర్దిష్ట పనివేళలకు సంబంధించి ఎంతమంది ఎలక్ట్రానిక్ తంబ్ (వేలుముద్ర గుర్తింపు) లో మస్టర్ పడ్డారు. మధ్యాహ్నం లంచ్ టైం సాయంత్రం అవుట్ మస్టర్ కు సంబంధించి కూడా తనిఖీలు నిర్వహించారు.
తమకు కేటాయించిన పనిపై ఎంతమంది ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు ఎంతమంది ఉద్యోగ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారో పరిశీలించినట్లు తెలిసింది.
ఉద్యోగుల పనివేళల్లో పని సంస్కృతిలో ఎంతటి వారైనా కార్మిక సంఘాల నాయకులతో సహా రాజీపడమన్న బలరాం ఆదేశాలు వెలువడిన రెండు రోజుల్లోనే ఆడిటింగ్ అధికారులు మణుగూరు ఏరియాను సందర్శించడం నిశితంగా తనిఖీలు నిర్వహించటం ఉద్యోగుల్లో చర్చనీయాంశం అయినది.