BadradrikothagudemTelangana

భూగర్భ జలాల అభివృద్ధి కి  తోడ్పడాలి.

భూగర్భ జలాల అభివృద్ధి కి  తోడ్పడాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ 

చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీలో నిర్మించినటువంటి రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇంకుడు గుంట నిర్మాణాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటను నిర్మించాలని తద్వారా ప్రతి భవనం పై పడినటువంటి వర్షపు నీటి చుక్కను వడిసి పట్టి భూగర్భ జలాల అభివృద్ధికి తోడ్పడాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్  తెలిపారు.

ప్రభుత్వం బిల్లింగ్ లకు గాని ప్రైవేట్ బిల్డింగ్లకు గాని ప్రతి ఒక్కరు వీటిని నిర్మించి భావితరాల భవిష్యత్తుకు బాట వేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యానగర్ గ్రామపంచాయతీలో నిర్మించినటువంటి రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తో పాటుగా కొత్తవరవడి తోటి ఏర్పాటు చేసినటువంటి పిచ్చి గడ్డిని తొలగించు యంత్రాన్ని పరిశీలించారు. ఈ యొక్క విధానం చాలా బాగుందని ఈ యొక్క యంత్రాన్ని అందరూ ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

గ్రామపంచాయతీ కార్యాలయంలో పనస మొక్కను నాటి, ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అందరూ కూడా మొక్కలు నాటే విధంగా ఉత్తేజితం చేసి పర్యావరణ పరిరక్షణ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలియజేసినారు. వీరి వెంట ఇట్టి కార్యక్రమంలోవిద్యా చందన, చుంచుపల్లి తాసిల్దార్ , విద్యానగర్ ప్రత్యేక అధికారి పానెం కృష్ణ,ఎంపీడీవో వీడివి అశోక్ కుమార్ , ఎంపీఓ సత్యనారాయణ ,ఈజీఎస్ ఈసీ పి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి మరియు గ్రామపంచాయతీ సిబ్బంది  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *