తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్ సార్
తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్ సార్
అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల యాస,బాషా,సంస్కృతులు,జీవన విధానంపై పూర్తి అవగాహన ఉన్న జయ శంకర్ సార్ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు వ్రాసి తెలంగాణలోనే కాకుండా,దేశంలోని ఇతర ప్రాంతాల్లో,విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారన్నారు .
జయశంకర్ సార్ తన ఆస్తిని,జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని కొనియాడారు.తన జీవితాన్ని తెలంగాణ ప్రజాశ్రేయస్సు కోసమే వెచ్చించి,హక్కుల కోసం ఉద్యమాలతో మమేకమై, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన కృషి ఉందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నీళ్లు,నిధులు, నియామకాలు అందుతున్నాయని అన్నారు.ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దానిని ఎలా అభివృద్ది చేసుకోవాలో ఆయన ఏ విధంగా కలలు కన్నారో దానిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దానిలో మనమందరం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.