అటవీ ప్రాంతంలో సంయుక్తంగా పోలీస్ బలగాలు
అటవీ ప్రాంతంలో సంయుక్తంగా పోలీస్ బలగాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా నిషేధిత మావోయిస్టు పార్టీ కమిటీకి చెందిన భద్రు,లచ్చన్న లతో పాటు దాదాపు 15 మందినిషేధితసిపిఐమావోయిస్టుపార్టీసభ్యులుఆయుధాలతోఅక్రమంగా,అప్రజాస్వామికంగాదామరతోగు,గుండాల,కరకగూడెం,తాడ్వాయిఅటవీప్రాంతంలోసంచరిస్తూఅసాంఘికకార్యకలాపాలకుపాల్పడుతూవ్యాపారస్తులను,రైతులను,కాంట్రాక్టర్లను బెదిరిస్తూ మావోయిస్టు పార్టీ కోసం చందాలు ఇవ్వాలని చెబుతూ వసూళ్లకు తెగబడుతున్నారని అందిన నమ్మదగిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో సంయుక్తంగా పోలీస్ బలగాలను మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడం కోసం మరియు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం కూంబింగ్ ఆపరేషన్ ను చేపట్టడం జరిగింది.
ఇట్టి ఆపరేషన్లో భాగంగా సుమారుగా ఉదయం 10 గంటల సమయంలో దామరతోగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీస్ బలగాలపై అకస్మాత్తుగా నిషేధిత మారణాయుధాలతో మావోయిస్టులు కాల్పులు ప్రారభించినారు.పోలీస్ బలగాలు మావోయిస్టులను లొంగిపొమ్మని హెచ్చరించినప్పటికీ లెక్కచేయకుండా పోలీసువారిని చంపాలనే ఉద్దేశ్యంతో చుట్టుముట్టి ఇంకా కాల్పులు అధికంగా జరుపుతుండగా,తప్పనిసరి పరిస్థితులలో మావోయిస్టులను నివారించడానికి తిరిగి వారిపై పోలీసులు ఎదురుకాల్పులు జరపడం జరిగింది.కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుండి కాల్పులు ఆగిపోయాయి.అనంతరం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సోదా చేయగా ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన 25 సంవత్సరాల యువకుడి మృతదేహం,303 మరియు SLR ఆయుధాలు,మందుగుండు సామాగ్రి,విప్లవ సాహిత్యం మరియు తదితర వస్తువులను స్వాధీనం చేసుకోవడమైనది.తప్పించుకున్న నిషేదిత సీపిఐ మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.