Police: నకిలీ విలేకరులను అరెస్టు చేసిన కొత్తగూడెం పోలీసులు
నకిలీ విలేకరులను అరెస్టు చేసిన కొత్తగూడెం పోలీసులు
కొత్తగూడెం సన్యాసిబస్తి లో దాసరి సాంబశివరావు కు దూరపు బందువు అయిన దాసరి పూర్ణ అను ఒక ఆడ మనిషిని అక్రమ సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో తన భర్త కొట్టి చంపినాడు.ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులను అక్రమ సంబంధం వలన మర్డర్ చేసారని పేపర్ ప్రచురిస్తామని బెదిరించి వారి దగ్గర ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని ఐదుగురు వ్యక్తులు ఆ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాలపడ్డారని వన్ టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు.
మృతురాలి కుమారుడైన కార్తిక్ కు శ్రీనివాస్ అను వ్యక్తి ఫోన్ చేసి రిపోర్టర్ అని చెప్పి మీ తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకున్నది అందుకే మీ నాన్న మీ తల్లిని చంపాడని,పేపర్లో ఆ విషయాన్ని రాయకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని బెదిరించాడని వివరాలు తెలిపారు.
ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేసి మా మనుషులు మీ ఇంటికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుతారు అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు.అదే రోజు రాత్రి సుమారు 9 గంటలకు దాసరి కార్తీక్ ఇంటి దగ్గరకు శ్రీనివాస్ మరియు దాసరి సాంబశివరావు మరియు మరో ముగ్గురు వ్యక్తులు అయిన రమేష్,రాజేష్,గణేష్ లు వెళ్లి పత్రికా విలేకరులమని చెప్పి బెదిరించి డబ్బుల కోసం బెదిరించారని విచారణలో తేలిందన్నారు.కానీ అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వారు తిరిగి వచ్చేసినారు.అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరు అయిదుగురుపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
కొత్తగూడెం పట్టణంలో కొంతమంది వ్యక్తులు విలేకరులమని చెబుతూ ఒక ముఠాగా ఏర్పడి సామాన్య ప్రజలను డబ్బుల కోసం వేధిస్తున్నారని తమ దృష్టికి వస్తుందని,దీనివలన నిజాయితీగా విలేకరులుగా పనిచేసే వారికి చెడ్డపేరు వస్తుందని 1టౌన్ సీఐ అన్నారు.ఎవరైనా విలేకరులమని చెప్పి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.


