వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కొత్తగూడెం ఆర్డీవో
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కొత్తగూడెం ఆర్డీవో.
వరద ప్రభావిత ప్రాంతాలైన గుమ్మడవెల్లి మరియు పెద్దవాగు పరిసర ప్రాంతాలను కొత్తగూడెం ఆర్డిఓ మధు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన వరదల వల్ల దెబ్బతిన్న ఇల్లు మరియు వ్యవసాయ భూముల లో ఇసుక మేటలను పరిశీలించి వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా సహాయం అందుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు 44 పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు 21 కచ్చా ఇల్లు 3 మరియు పశువుల కొట్టాలు 42 గుర్తించామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న గుడిసెలకు 4100 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న పక్కా గృహాలకు 5200, కచ్చా ఇళ్లకు 3200 మరియు పశువుల కొట్టాలకు 2100 రూపాయలు ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపరిహారం కింద మొత్తం 394700 రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
పెద వాగు ప్రాజెక్టు వరద బాధితులకు గుమ్మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించి శుక్రవారం మరియు శనివారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో వరద బాధితులకు భోజన ఏర్పాటు చేశామని తెలిపారు. గుమ్మడివల్లిలో ఎన్పీడీసీఎల్ సిబ్బంది ద్వారా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు.వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.