సాహిత్యం ముందు తరాలకు ఆదర్శం
సాహిత్యం ముందు తరాలకు ఆదర్శం
సాహిత్యo భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని దీనితోపాటు నైపుణ్యం కూడా ఉంటే భవిష్యత్తు ఉజ్వాలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అనందఖని లోని టీచర్స్ ట్రైనింగు సెంటర్ లో తెలంగాణ సాహిత్య పరిషత్ హైదారాబాద్ వారు నిర్వహించిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్ర ను గ్రంథ స్ధం చేసి భా వితరాలకు అందించడం శుభదాయకం అని, మన జిల్లా లో ఎంతో సాహిత్యం,చరిత్ర ఉందని దానిని విద్యార్థులకు ఉపాధ్యాయులే అందించాలని సాహిత్యం ద్వారా విద్యార్థుల లో మంచి నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లావిద్యాధికారి యం వెంకటేశ్వరాచారి, సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య నవభారత్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ బాబు జిల్లా మానిటరింగ్ అధికారి గ్రంథ కన్వీనర్ డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, కోర్ కమిటీ సభ్యులు రచయితలు పాల్గొన్నారు.