BadradrikothagudemTelangana

Breastfeeding : తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయండి.

తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయండి.

భద్రాద్రి కొత్తగూడెం:స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ జీతిష్  ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించే తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత వివరించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలిపారు.

అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖ సమన్వయంతో తల్లిపాల సంస్కృతి వలన తల్లులకు  పిల్లలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించాలని, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇప్పించడం, ఆరు నెలల మీదట అనుబంధ కుటుంబ ఆహారం అదనంగా ప్రారంభించడం, తల్లిపాలు రెండు సంవత్సరాల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువ కాలం ఇప్పించడం మరియు సరైన పోషణ విధానం పై వారికి వివరించాలని పేర్కొన్నారు.

ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఈ అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించి మెరుగైన ఫలితాలు రాబట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత, పోషణ అభియాన్ జిల్లా సమన్వయకర్త పొనుగోటి సంపత్, జిల్లా ప్రాజెక్ట్ అసోసియేట్ బి.రాము, ప్రాజెక్ట్ స్థాయి కోఆర్డినేటర్లు రామకృష్ణ, శ్రీకాంత్, సోనీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *