BadradrikothagudemManuguru

మణుగూరు ఆదివాసీ జేఏసీ అడ్ – హక్ కమిటీ ఎన్నిక

మణుగూరు ఆదివాసీ జేఏసీ అడ్ – హక్ కమిటీ ఎన్నిక

మణుగూరు: తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ గుడి ప్రాంగణంలో స్థానిక ఆదివాసి సంఘాలు ఆదివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క సమావేశం కూ హాజరైన నాయకులు వివిధ ఆదివాసీ సమస్యల పై చర్చించారు.  ముఖ్యంగా.. ఆదివాసీ మహిళలు మరియు ఉద్యోగుల సంరక్షణ కోసం కార్యాలయాలలో మహిళల వేధింపులకు రక్షణగా కమిటీలు వేయాల్సి వున్న, వేయకపోవడం వల్లన అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు . ఆదివాసీ ఉప తెగల విద్యా అవకాశాల కల్పన కొరకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి వుందని, ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం స్థానిక ఆదివాసులకు శిక్షణ ఇచ్చి 100% ఉద్యోగ కల్పన అన్ని విభాగాలలో కల్పించాలన్నారు.

ఆదివాసీ తెగల సంక్షేమం కొరకు ప్రత్యేక  ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేయలి 

సమతా జడ్జిమెంట్ ప్రకారం లాభాలలో  25% వాటా నూ స్థానికంగా ఖర్చు చేయడంతో పాటు, స్థానిక పరిశ్రమలో కాంట్రాక్టు పనులు ఆదివాసులకు కేటాయించాలని, ఆదివాసీ తెగల సంక్షేమం కొరకు ప్రత్యేక  ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, నీళ్లు సందుపాయం లేని ఆదివాసీ రైతులకు పీఎం యోజన స్కీమ్ కింద సోలార్ పంప్స్  సెట్ల నూ మంజూరు చేయాలని, భూ ఆక్రమణ నిరోధం కొరకు మరియు అక్రమ నిర్మాణాల నిలుపుదల చేయడం కోరకు, చట్టాల పటిష్ట అమలు కోరకు అధికారుల చోరువ చూపాలని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవంనూ ఘనంగా ఐక్యంగా ఆదివాసీ గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం, ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నూ ఈ ఎన్నుకున్నారు.

కమిటీ వివరాలు:
అధ్యక్షులు: సోడే రవికుమార్ దొర
ఉపాధ్యక్షులు: ఇర్ఫ రవికుమార్ దొర, గనిబోయిన ముత్తయ్య, పూణెం రమేష్
ప్రధాన కార్యదర్శి: వాగబోయిన శ్రీను
సహాయ కార్యదర్శి: పాయం నాగరాజు, కారం నరసింహారావు.
కార్యదర్శి: పూణెం నాగరాజు
కోశాధికారి: జోగ సురేంద్ర ప్రసాద్
సభ్యులు: బండారి కృష్ణ, కోండ్రు ప్రశాంత్, ఏనిక విజయ కుమారి, వాడే సీతారాములు.
మహిళ కార్యదర్శి: కాయం తిరుపతమ్మ
ప్రచార కార్యదర్శి: వజ్జ జ్యోతిబసు

గౌరవ సలహాదారులు
కురుసం నాగేశ్వరరావు, చీమల సత్యం, కొమరం అనిల్, ఊకే ముద్ద రాజు, కనితి రాంబాబు, సోడే వెంకటేశ్వర్లు, లతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి తదితర సభ్యులు హాజరైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *