Badradrikothagudem

 మాయమాటలు చెబుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు

 మాయమాటలు చెబుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు

అమాయకురాలైన బండి రాధా..నీల్సో ను అతికిరాతకంగా చంపి చర్ల మండలం చెన్నాపురం గ్రామ శివారులో మృతదేహాన్ని రోడ్డుపై పడవేసిన మావోయిస్టు పార్టీ నాయకులు వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాయమాటలు చెబుతూ పత్రికా ప్రకటనలు చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనంగా కనబడుతుంది.

ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో ఒక విలువైన జీవితాన్ని గడపాలనుకున్న రాధాను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని ఆమె భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి చివరికి జీవితాన్నే లేకుండా చేసిన మావోయిస్టు పార్టీ నాయకులకు మానవత్వమే లేదనేది ఈ విషయం ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.దళితురాలైన రాధా అనతికాలంలోనే పట్టుదలతో తమ పార్టీలో నాయకత్వం వహించే స్థాయికి చేరిందని పొగుడుతున్నారు కదా ! అలాంటప్పుడు చంపవలసిన అవసరం ఏమి ఉంది ?ఆమెను అతికిరాతకంగా చంపేసి, తప్పును కప్పిపుచ్చుకోవటానికి పోలీసులు భాద్యత వహించాలని ప్రకటన విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? తమ సొంత పార్టీ చేతిలోనే హత్యకు గురైన రాధాను శారీరకంగా,మానసికంగా ఇబ్బందులకు గురిచేసి,ఆమెను లైంగికంగా వేధిస్తూ,కులం పేరుతో దూషించి,చిత్రహింసలకు గురి చేశారని ఆమె సోదరుడు కూడా ఆరోపించారు.ఆమెను చంపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, దారుణంగా చంపి, బాధ్యతలు నెరవేర్చామంటున్నారు.అదీగాక తనే మరణశిక్షను అంగీకరించిందన్నారు.ఆమె అంగీకరిస్తే వీళ్ళు చంపేయడమేనా? చాలా నిర్లక్ష్యంగా,నిస్సిగ్గుగా ప్రకటనను విడుదల చేశారు.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అమాయకులైన యువతీయువకులను పార్టీలోకి చేర్చుకొని వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు.

పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెబుతూనే వారిని బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని చిత్రహింసలకు గురి చేస్తున్న మావోయిస్టు పార్టీ ప్రజలలో ఎప్పుడో ఆదరణ కోల్పోయింది.తమ ఉనికిని చాటుకోవడానికి లొంగిపోవడానికి సిద్ధమైన అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన రాధా లాంటి దళిత మహిళను పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్రవేయడం అగ్రనాయకుల నీచమైన ఆలోచనలకు నిదర్శనం.తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లి మావోయిస్టు పార్టీలోకి చేర్చుకున్నారని రాధా తల్లి పల్లెపాటి పోచమ్మ గారు 2022 జనవరిలో విశాఖపట్నం జిల్లా,పెద్దబయలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఇట్టి విషయంలో తేదీ 03.01.2022న Cr.No.01/2022 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.కేవలం నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు విలాసవంతమైన జీవితాలను గడపడానికే అమాయకులై ఆదివాసి ప్రజలను బానిసలుగా మార్చుకుని,వారినిఅభివృద్ధికిదూరంచేస్తూభవిష్యత్తునునాశనంచేస్తున్నారు.ప్రజలు,యువత,మహిళలు,మేధావులు,షెడ్యూలు కులాల,షెడ్యూలు తెగల ప్రజాసంఘాలు ఈ అనాగరికమైన హత్యను తీవ్రంగా ఖండిచాల్సిన అవసరం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *