Badradrikothagudem

Collector: లేఔట్ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు.

లేఔట్ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు.

రాష్ట్రంలో నాన్ లేఅవుట్ భూముల క్రమబద్దికరణ కోసం దరఖాస్తు చేసుకున్న లేఔట్ ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ మార్చి 2025 నాటికి పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి భూపాల్ పల్లి జిల్లా ఐ.డి.ఓ.సి నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫిరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్  పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్ ముందస్తుగా ఎల్.ఆర్.ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న ప్రణాళిక మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులకు సంబంధించి అనుసరించాల్సిన విధానం పై ప్రభుత్వం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, న్యాయపరమైన దరఖాస్తుల రెగ్యులరేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించామని అన్నారు.

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సపోర్ట్ సిస్టం అధికారులకు పూర్తి స్థాయిలో అందిస్తామని అన్నారు. 2020 నాటి ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడ ప్రభుత్వ భూమికి నష్టం కలగ వద్దని, అదే విధంగా నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడలద్దని అధికారులకు సూచించారు.ఎల్.ఆర్.ఎస్ సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని , వీటి స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్క్రూటినీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని , దీనికి సంబంధించి అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్ర స్థాయి నుంచి అందించడం జరుగుతుందని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్ 2020 క్రింద 25 లక్షల 70 వేల 708 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటి వరకు 4 లక్షల 28 వేల 832 దరఖాస్తుల స్క్రూటినీ చేసి 60 వేల 213 దరఖాస్తుల ఆమోదించి సదరు భూముల క్రమబద్దికరణ చేశామని అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *