జలశక్తి అభియాన్ కేంద్ర బృంద సభ్యులు పర్యటన.
జలశక్తి అభియాన్ కేంద్ర బృంద సభ్యులు పర్యటన.
జల శక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు అయినఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ డిప్యూటీ సెక్రటరీ, గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అధికారి శ్రీనివాస విటల్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల బావోజీ తండా, గట్టు మల్ల, మైలారం, బంగారు చెలక మరియు బొజ్జలగూడెం గ్రామపంచాయతీలలోని ఉపాధి హామీ ద్వారా మంజూరై ,నీటి సంరక్షణను కాపాడే లేదా అభివృద్ధి చేసే పనులను పరిశీలించారు.
ఇందులో భాగంగా రేగళ్ల , బావోజీ తండా గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న అటవీ భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితవనాలు అభివృద్ధిలో భాగంగా 12 ఎకరాల అటవీ భూమిలో 6, 000 అటవీ, మరియు పండ్ల మొక్కలను నాటించడం జరిగింది. పనిని మరియు మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు .తిరిగి ఇవే మొక్కలు నవంబర్ మాసంలో తిరిగి పరిశీలిస్తామని తెలిపారు.
పర్యటనలో భాగంగా గట్టుమల్ల గ్రామపంచాయతీలో షెడ్యూల్ ట్రైబ్ కులానికి చెందిన వాసం . సుభద్ర పొలంలో ఉపాధి హామీ ద్వారా మంజూరై నిర్మాణం పూర్తయిన పామ్ పాండ్ ను పరిశీలించడం జరిగింది ఇక్కడ నిర్మాణం జరిగిన ఫారం పాండ్ వల్ల ఉపయోగంను లబ్ధిదారుని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. బురదలో కూడా నడుచుకుంటూ వెళ్లి పని ప్రదేశంలోని పరిశీలించారు.
పర్యటనలో భాగంగా గట్టు మల్ల గ్రామపంచాయతీలో గంగమ్మ కాలనీ నందు నీటి సంరక్షణలో భాగంగా బోర్వెల్ దగ్గరలో కమ్యూనిటీ సోక్ పిట్ పనిని ప్రారంభించారు.గట్టు మల్ల గ్రామపంచాయతీ పరిధిలోని అల్లి. వీరన్న చెరువు పూడికతీత పనులను గత సంవత్సరం చేయడం వల్ల నీటి సామర్థ్యం పెరిగి ప్రస్తుతం అలుగుల ద్వారా ఎక్కువ నీళ్లు కిందకి వెళ్లడాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే పాఠశాలలో మొక్కలను కూడా పరిశీలించారు.