Badradrikothagudem

ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన్న మంత్రి పొంగులేటి

ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన్న మంత్రి పొంగులేటి.

జర్నలిస్టులు నిజాలను నిర్భయం గా రాయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా పాల్వంచలో జెన్కో కేటాయించిన స్థలంలో శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి వరావు తో కలిసి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభు త్వానికి వ్యతిరేకంగా వార్తల రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే వీలుందన్నారు. ఆ ట్యూబులు ఈ ట్యూబులు పేరిట తమ ప్రభుత్వంపై బురద చల్లేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

తప్పులు ప్రభుత్వం చేసిన ప్రతిపక్షం చేసిన విలేకరు లు ధైర్యంగా వార్తలు రాసి ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. వైయస్ హయాంలో హైదరాబాదులో 72 ఎకరాల భూమిలో 1050 మంది విలేకరులకు ఇంటి పట్టాలు ఇచ్చిన గత ప్రభుత్వంలో కోర్టులో విలేకరులకు స్థలాలు ఇచ్చే విధంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు.

తమ ప్రభుత్వంలో త్వరలోనే జవహర్ సొసైటీకి ఈ స్థలాలను భారీ బహిరంగ సభ నిర్వహించి వారి సమక్షంలో అందజేస్తామన్నారు.కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసిన పట్టించుకోమన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వా నిదేనన్నారు.

అర్హులైన జర్నలిస్టు లందరికీ అక్రిడేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మా టలు చెప్పిందని తమ ప్రభుత్వం చేతల ద్వారా చేస్తుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎటు వంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *