BadradrikothagudemTelangana

 కళాశాల విద్యార్థులకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన సదస్సు.

 కళాశాల విద్యార్థులకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన సదస్సు.

 ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ కళాశాలల విద్యార్థులకు వరదల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, టెన్త్ బెటాలియన్ ఎన్ డి ఆర్ ఎఫ్ విజయవాడ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర కుమార్ తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 వరదల సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలను రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేయాలని, అనంతరం పునరావాస కేంద్రానికి తరలించాల్సిన ప్రజలను గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన, కుంభవృష్టి ,బలమైన గాలులు,వరదల్లో చేయవలసిన మరియు చేయకూడని పనులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

వరదల సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి అనే అంశాలను తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో వివరించారు.యువతకువరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి తగిన అవగాహన అవసరమని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులకు వరదల సమయంలో తీసుకోవలసిన చర్యలపై తగిన శిక్షణ కల్పిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *