పీ వి కాలనీ రోడ్డులో నిద్రామాను చెట్లను కాపాడాలి
పీ వి కాలనీ రోడ్డులో నిద్రామాను చెట్లను కాపాడాలి
పీ వి కాలనీ రోడ్డులో మూఢనమ్మకాలకు నేలకొరుగుతున్న నిద్రామాను చెట్లను కాపాడాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు శుక్రవారం నాడు మణుగూరు తహశీల్దార్ వి. రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు కు సంబంధించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1978లో సింగరేణి యాజమాన్యం సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయం నుండి పివి కాలనీ కూనవరం గేట్ వరకు ప్రధాన రహదారి కి ఇరువైపులా నిద్రమాను మొక్కలను నాటారని నేడు అవి వృక్షాలుగా పెరిగి పాదచారులకు నీడను ఇస్తున్నాయన్నారు . ఈ రోడ్డులో ఆహ్లాదకర వాతావరణంతో పాటు కంటికి చక్కని అందాన్ని ఇస్తున్నాయని కానీ కొంతమంది గృహ యజమానులు మూఢనమ్మకాలతో సెంటిమెంట్ పేరుతో తమ ఇళ్లకు ఎదురుగా ఉన్న చెట్లను నేరుగా నరికితే ఇబ్బందులు ఎదురవుతాయని తెలివిగా కాండం వద్ద పై తొక్కను పెద్ద ఎత్తున చుట్టూ గాటును పెట్టడంతో కొద్ది రోజులకే అవి ఎండిపోతున్నాయన్నారు. చూడటానికి చెట్లు సహజ మరణానికి గురయ్యేలా చేస్తున్నారన్నారు, ఒక మొక్కను నాటి అది వృక్షంగా పెరగాలంటే కొన్ని తరాలు పడుతుందని, అది గమనించకుండా కొంతమంది మూర్ఖత్వంతో చెట్లను పచ్చదనాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వెంటనే ఆర్ అండ్ బి మరియు సింగరేణి పర్యావరణ విభాగం అధికారులు స్పందించేలా రెవెన్యూ శాఖ నుండి తగు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మార్వో ని విజ్ఞప్తి చేసినట్లు కర్నే బాబురావు తెలిపారు. ఎమ్మార్వో సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.