ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమం
ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమం
ఖమ్మం జిల్లా 2004 సంవత్సరం మణుగూరు ఏరియాలో మల్లె పెళ్లి ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా చెలరేగిన మహా ఉద్యమ ప్రదర్శన. పాత మణుగూరు లోని ప్రతి ఇంటి గడప నుండి పసిపిల్లల నుండి ముసలి వారి వరకు గొప్ప ప్రజా ప్రదర్శన నిర్వహించడం దానికి తోడు మణుగూరు ను బంద్ చేయడం మణుగూరు చరిత్రలో మరపురాని సంఘటన అన్ని ప్రజా సంఘాల మద్దతు తెలిపిన ఈ భారీ బహిరంగ ప్రదర్శన అధికారులను అలజడి చేకూర్చాయి.
రెండు దశాబ్దాల క్రితం మణుగూరు పట్టణంలో నిర్వహించిన ప్రదర్శన దృశ్యాలు నేటికీ కండ్లకు కట్టినట్లుగా దర్శనమిస్తున్నాయి. ఆనాడు స్థానిక పాత్రియల బృందం ఈ మహా ఉద్యమానికి అక్షరాల రూపంలో జిల్లా అధికారుల నుండి రాష్ట్ర అధికారుల వరకు సింగరేణి అధికారులకు నాటి రాజకీయ నాయకులకు చలనం పుట్టించారు.
ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా ఉద్యమానికి స్థానిక పోలీసుల విభాగం ఎంతో ఓపికగా అసంఘీక కార్యక్రమాలు జరగకుండా చూపిన చొరవ ఎంతో గొప్పతనాన్ని ఇచ్చింది. ఎన్ని ప్రదర్శనలు చేసిన మణుగూరు రైతుల ఆత్మఘోష ముందు తూతూ మంత్రం ప్రభుత్వ ప్యాకేజీలతో మణుగూరు ఓపెన్ కాస్ట్ తుది రూపం ఎత్తింది. వారి ఆక్రందనలు నిరసనలు ప్రదర్శనలు వ్యతిరేకతను ఎంత చాటిన చివరికి వారికి నిరాశే మిగిలింది.