ప్రజాకవి కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
ప్రజాకవి కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్ర పటానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాసకు కాళోజీ నారాయణరావు చేసిన సేవలు కొనియాడారు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుంచి 1960 వరకు పనిచేశారని, రెండేండ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా కొనసాగారని అన్నారు.కాళోజీ ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ వ్యవస్థాపక సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడుగాను పనిచేశారని అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగానూ, 1957–-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యుడిగానూ ఉన్నారని చెప్పారు.1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగంవెంగళరావుపై పోటీచేసిఓడిపోయారని గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, పరిపాలన అధికారి గన్యా, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, డి సి ఓ సయ్యద్ హుర్షీద్, ఉప కోశాధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.