రైతు రుణమాఫీ పై అన్ని మండలాల్లో ప్రజావాణి
రైతు రుణమాఫీ పై అన్ని మండలాల్లో ప్రజావాణి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా 12-12-2018 నుండి ఆగస్టు 15 2024 వరకు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిలో రుణమాఫీ కానీ వారు దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ అధికారులు (A.O)మంగళవారం (20-08-2024) నుండి 30-08- 2024 వరకు రైతు రుణమాఫీ పై ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రైతు రుణమాఫీ కానీ రైతులందరూ తమ తమ మండలాల్లోని వ్యవసాయ అధికారులను (A.O) కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అని తెలిపారు.
జిల్లాలోని అర్హత కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చెల్లిస్తుందని. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం రైతులకు కల్పించిన ఈ సదావకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఏదేని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ సంబంధిత పోర్టల్ లో ఆన్లైన్ చేస్తామని తెలిపారు. జిల్లాలోని 23 మండలాల వ్యవసాయ అధికారుల పేర్లు మరియు ఫోన్ నెంబర్లు కింద పొందుపరచడం జరిగింది.