Badradrikothagudem

గ్రామాలలో ప్రజలకు వ్యాధులు రాకుండా అడ్డుకట్ట

గ్రామాలలో ప్రజలకు వ్యాధులు రాకుండా అడ్డుకట్ట

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, మంచినీటి గ్రామ సహాయకుల నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగాజరిగిన మంచినీటి నాణ్యత శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే   కూనంనేని సాంబశివరావు  హాజరై మాట్లాడారు.గ్రామాలలో మంచినీటి సహాయకులు చురుకుగా పనిచేస్తే గ్రామాలలో ప్రజలకు వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు అన్నారు. గ్రామాలలో గ్రామ మంచినీటి సహాయకులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ మరియు ఇంట్రా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్  నలిని  గౌరవ తిరుమలేష్ పాల్గొని గ్రామాలలో ప్రతిరోజు మంచినీటి ట్యాంకుల వద్ద ప్రజలకు వ్యాధులు రాకుండా క్లోరినేషన్ చేయాలని మంచినీటి గ్రామ సహాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బ్రహ్మదేవ్  శివయ్య  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వెంకటస్వామి, వసంత మరియు నీటి నాణ్యత ప్రయోగశాలల టెక్నీషియన్స్ వరుణ్ నజీర్ ప్రవీణ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *