కామాంధులపైన వెంటనే శిక్షలు అమలు కావాలి
కామాంధులపైన వెంటనే శిక్షలు అమలు కావాలి.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న.
ఆడపిల్లలను వేధించిన ఆడపిల్లల పై లైంగిక దాడులు జరిపే నిందితులను, కామాంధులపైన వెంటనే శిక్షలు అమలు కావాలని,నిందితులకు మరొకసారి ఇలాంటి అరాచకాలు చేయాలంటే వణుకు పుట్టే విధంగా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ,కామాంధులపై వెంటనేశిక్ష అమలు కావాలి న్యాయవ్యవస్థలో ని లోపాలను సవరించాలి అభాగ్యులను ఆదుకొని నిందితులను శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు.
పెద్దపెల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో గురువారం అర్ధరాత్రి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని వెంటనే శిక్షించాలని తోట దేవి ప్రసన్నఅన్నారు. బీహార్ కి చెందిన వినోద్ 28 సంవత్సరాలు అనే నిందితుడు నేరానికి ముందు బాలికను వెళుతున్న దృశ్యం సిసిటివి కెమెరాలకు చిక్కింది. బాధితురాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన కూలీ దంపతుల కుమార్తె అని సమాచారం సోదాల అనంతరం సుల్తానాబాద్ లో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి.
ఈ సంఘటన పై మహిళా కాంగ్రెస్ తరఫున ఆత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని సత్వర న్యాయం బాలిక కుటుంబానికి చేయాలని మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిలు పొదిలి జ్యోతి, పందాల సరిత, బోడదివ్య, మహిళా కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ సున్నం లక్ష్మి, మహిళా కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షురాలు కృష్ణవేణి, పద్మశ్రీ,నాగోలు శ్రీలక్ష్మి, శారద, సావిత్రి,విజయలక్ష్మి, సుశీల, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.