విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉన్నదని , సేవలు అందించే క్రమంలో సంస్థ సిబ్బంది వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని యాజమాన్యం తేల్చిచెప్పింది .
సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని, టీజీఎన్పీడీసీఎల్ సంస్థకు సంబంధించిన సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే, విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్న ఈ నంబరుకు 9281033233, అలాగే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయగలరని తెలిపారు.
సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఉత్తమమైన సేవలలో భాగంగా కాల పరిమితికి(సిటిజన్ చార్టర్) లోబడి సేవలు అందించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి “ఎన్పీడీసీఎల్ గ్రీవీయన్స్ పోర్టల్ “పెట్టడం జరిగిందని ఇందులో సమస్యలను పరిష్కరించుకోవచ్చని వివరించారు .లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అని 16 సర్కిళ్ల పరిధిలో అన్ని కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ లలో పోస్టర్లను ఇదివరకే పెట్టడం జరిగిందని చెప్పారు. ఎవరైనా లంచం అడిగిన అందులో పొందు పరచబడిన నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు .అవినీతి రహిత సమాజము లో భాగంగా విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్ధం ఈ పోస్టర్లను అతికించడం జరిగిందని అన్నారు .