అటవీ సమస్యలు పోడు భూమి రైతుల రుణాలపై సమీక్ష సమావేశం.
అటవీ సమస్యలు పోడు భూమి రైతుల రుణాలపై సమీక్ష సమావేశం.
మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అటవీ సంబంధిత మరియు పోడు రైతులకు రుణాలు మంజూరు తదితర అంశాలపై జిల్లాలోని అన్ని బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజన రైతులందరికీ వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అందరు అధికారులను ఆదేశించారు. రైతులందరికీ సురక్ష బీమా, జీవన జ్యోతి బీమా 456 సంవత్సరానికి గాను బీమా చేయించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు పై ఇన్సూరెన్స్ చెయ్యాలి అని రైతులపై ఒత్తిడి చేయరాదని ఆదేశించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు అధికారులకు జూన్ మీటింగ్ నిర్వహించి రుణ మంజూరు పై దిశ నిర్దేశం చేయవలసిందిగా ఐటిడిఎపిఓ రాహుల్ కు సూచించారు.
జిల్లాలో 23 మంది మహిళలు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ తీసుకొని వచ్చారు. వారికి సరైన రుణం మంజూరు చేయటం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మరియు దాతలు ఇచ్చిన అధ్య చెల్లించనటువంటి భవనాలకు ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఉచిత కరెంటు సరఫరా చేయడం జరుగుతుందని ప్రతిపాదనను ఆగస్టు 15 లోపు సమర్పించవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోడు వ్యవసాయం చేసే రైతులకు బోర్ వేసుకునేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు త్వరితగతిన మంజూర ఎలా చూడాలని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ ను కోరారు. వేసిన బోర్లకు ఉచిత విద్యుత్ ను అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ లోపు జిల్లాలోని ఒక గ్రామంలో పోడు వ్యవసాయం చేసే రైతులు అందరికీ ఉచిత విద్యుత్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.