ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు తీర్పు తో రిజర్వేషన్లకు భంగం
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు తీర్పు తో రిజర్వేషన్లకు భంగం
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్లకు బంగంకలిగించేల ఆర్టికల్ 341 కి విరుద్ధం గా రాజకీయ ప్రమేయం ఉండేలా ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పేర్కొన్నారు.
మణుగూరు లో ఒక ప్రైవేటు కార్యక్రమం లో పాల్గొనటానికి మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ బూర్గుల వెంకటేశ్వర్లు తో కలిసి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు.ఈ నెల 8 9 10 తేదీ లలో డిల్లీలో నిరసన చేపడతామనిఅనంతరం మాల మహానాడు దేశం లోని వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలను, వివిధ సంఘాలను ఏకీకృతం చేసి పోరాడుతామని అన్నారు.రిజర్వేషన్ల లో వర్గీకరణ మళ్ళీ సూక్ష్మ వర్గీకరణ కు దారితీస్తుందని తద్వారా రిజర్వేషన్లకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెన్నయ్య పేర్కొన్నారు ఈ సమావేశంలో మాలమహానాడు జిల్లా మండల నాయకులు గులగట్టు ఎల్లయ్య పీర్నాకి నవీన్, విల్సన్, వేర్పుల నరేష్, దాసరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు.