Badradrikothagudem

సైబర్ జాగరుగత దివస్ కార్యక్రమం ఏర్పాటు

సైబర్ జాగరుగత దివస్ కార్యక్రమం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సూచనలతో జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సైబర్ జాగురుకత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవగాహనా కార్యక్రమాన్ని చుంచుపల్లిలోని సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ నందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్,సింగరేణి ఎంప్లాయిస్ అసోసియేషన్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు దాదాపు 100 మంది పాల్గొన్నట్లు జిల్లా సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్స్పెక్టర్ జితేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త విధానాలతో అమాయకుల ఖాతాల నుండి నగదును ఏ విధంగా కాజేస్తున్నారో వివరించారు.డిజిటల్ అరెస్టులు,కస్టమర్ కేర్ మోసాలు,ఇన్సూరెన్స్ సంబంధిత మోసాలు,ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మోసపూరిత ఆన్లైన్ లింకులు, ఓటిపి ఫ్రాడ్స్ మరియు మొదలగు విషయాలపై అవగాహన కల్పించడం జరిగిందని సీఐ తెలిపారు.

అదేవిధంగా 1930 టోల్ ఫ్రీ నంబరు పనిచేయు విధానం, గోల్డెన్ అవర్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం జరిగిందన్నారు.ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న సైబర్ నేరాల గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే గ్రహించి సరైన సమయంలో స్పందించగలిగితే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా అట్టి నేరస్తుల ఖాతాలను ఫ్రీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *