వరదలతో అప్రమతంగా ఉండాలి.
వరదలతో అప్రమతంగా ఉండాలి
వరద బాధితులకు పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని తాసిల్దారులను ఆదేశించారు.వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ మరియు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
దీనికిగాను సంబంధిత అధికారులతో పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మణుగూరు,భద్రాచలం, అశ్వరావుపేట, చర్ల లో బోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఇద్దరికీ లొకేషన్ మరియు వరద సంబంధించిన సమాచారం పంపే విధంగా తగిన శిక్షణ ఇవ్వవలసిందిగా తెలిపారు. అధికారులందరూ శ్రద్ధతో తమ విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వరద సహాయానికి కావలసిన పరికరాలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు నివేదిక సమర్పించాలని తెలిపారు.