కొండాపురం సిహెచ్ పి లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి.
కొండాపురం సిహెచ్ పి లో త్రాగునీటి సమస్య పరిష్కరించండి.
దుమ్ము ధూళి నివారణకు చర్యలు చేపట్టాలి.
ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సి హెచ్ పిఆవరణలో కార్మికుల ధర్నా.
డీజీఎం మదన్ నాయక్ కి వినతి పత్రం అందజేత
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు తప్పవు
యాజమాన్యానికి ఐ ఎన్ టి యు సి నాయకుల హెచ్చరిక
కొండాపురం సిహెచ్ పి లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని దుమ్ము ధూళి నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మొదటి షిఫ్ట్ ప్రారంభంలో కార్మికులు కొద్దిసేపు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు.అనంతరం మదన్ నాయక్ సిఎస్ పి డీజీఎం (ఈ అండ్ ఎం) కి కార్మికుల సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ధర్నాను ఉద్దేశించి బ్రాంచ్ కమిటీ ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య యాదవ్ మాట్లాడారు. కొండాపురం సిఎఎస్ పి లో పనిచేస్తున్న ఉద్యోగులు, గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని కనీసం త్రాగునీరు కూడా సరఫరా చేయలేకపోవడం బాధాకరం అన్నారు సింగరేణి సంక్షేమం ఎక్కడికి పోతోందని వారు వాపోయారు.
మొబైల్ క్రషర్ల వద్ద ఫైర్ కోల్ లిఫ్ట్ చేస్తున్న కారణంగా కొండాపురం సిఎస్ పి పెద్ద పెద్ద ఎత్తున దుమ్ము ధూళి కమ్ముకుంతుందోని ఆ దుమ్ము ధూళిలో పనిచేసిన కార్మికులు డ్యూటీ ముగిసిన అనంతరం ఇంటికి వెళితే కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టనంతగా అవతారం మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, కేవలం బొగ్గు రవాణా నే కాదు కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
సి ఎస్ పి ఆవరణలో నాటిన మల్లెలకు బొగ్గు మరక అంటనంతగా వాటర్ స్ప్రేయింగ్ తో దుమ్ము ధూళి నివారిస్తామని ప్రగల్బాలు పలికిన అధికారులు యాజమాన్యం ఆచరణలో త్రాగు నీరు కూడా సరఫరా చేయాలేని దుస్థితికి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు దిగజారిందని వారు ప్రశ్నించారు, సి ఎస్ పి లో లేస్తున్న దుమ్ము వలన కార్మికుల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో నష్టకరం అని కూడా వారు ఈ సందర్భంగా యాజమాన్యానికి గుర్తు చేశారు.
ఏరియా పర్యావరణ అధికారులకు ఈ విషయం ఎందుకు కనపడటం లేదని ప్రశ్నించారు.ఇప్పటికైనా ఏరియా యాజమాన్యం స్పందించి కొండాపురం సి హెచ్ పి లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని దుమ్ము ధూళి నివారణకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సిల్వేరు గట్టయ్య యాదవ్, జయరాజు, సి హెచ్ పి పిట్ నాయకులు వర్మ పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.