Grievance Day : గ్రీవెన్స్ డేలో బాధితుల సమస్యల పరిష్కారం.
గ్రీవెన్స్ డేలో బాధితుల సమస్యల పరిష్కారం.
సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భాదితులకు భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయానికి పలు సమస్యలతో వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మొత్తం 5 గురు భాదితులు ఎస్పీ ని స్వయంగా కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు.ఇందులో ముగ్గురు భాధితులు తమ భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని కోరారు.ఒక మహిళ తన భర్త బాగా త్రాగి వచ్చి ఇంట్లో అందరిపై దాడి చేస్తున్నాడని,పోలీసు స్టేషన్లో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
ఒక వ్యక్తికి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి చీటింగ్ చేసాడని ఫిర్యాదు చేశారు.ఈ ఐదుగురు బాధితులు విషయంలో వెంటనే విచారణ చేపట్టి భాధితులకు న్యాయం చేకూర్చాలని సంభంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు.