Police : పదవీ విరమణ పొందిన హోంగార్డు ను ఘనంగా సత్కరించిన ఎస్పీ
పదవీ విరమణ పొందిన హోంగార్డు ను ఘనంగా సత్కరించిన ఎస్పీ
పాల్వంచ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తూ పదవీ విరమణ పొందిన హోమ్ గార్డ్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సత్కరించారు.పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషకరంగా గడపాలని తెలిపారు.ప్రతి రోజు వ్యాయమం అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ హోమ్గార్డ్స్ నరసింహారావు,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు తదితరులు పాల్గొన్నారు.