BadradrikothagudemTelangana

పోషక విలువలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి .

పోషక విలువలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గురించి మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని, పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో,ఎక్కువ జ్వరాలు ఉన్నాయో గుర్తించి రోగులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి సమయంలో వైద్యం అందించాలన్నారు.

బరువు తక్కువ పిల్లల్ని గుర్తించి (sam,mam) పోషక విలువలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక,మాతాశిశు ఆరోగ్య కేంద్రాల్లో సీజేరియన్ అపరేషన్లను తగ్గించాలని,సాధారణ కాన్పుల శాతాన్ని పెంచాలన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోఏదైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకురావాలని, స్కూల్స్ లో 6 మెడికల్ ప్లాంట్స్ నాటాలని, పిల్లలకు ట్రెడేషన్ మందుల గూర్చి అవగాహన కల్పించాలని, టీ హబ్ పరీక్షా కేంద్రం లో ఇన్ టైం లొ రిజల్స్ట్ రావాలని ,టీ హబ్ వారు రూట్ మ్యాప్ తయారు చేసి మెడికల్ ఆఫీసర్ కి ఇవ్వాలని ,ఎన్సిడి స్క్రీనింగ్ 100% చేయాలి అని గర్భవతుల నమోదు 100% అవ్వడానికి అర్బన్ లో ఆర్ పి, మహిళా సమాఖ్య ,మెప్మా, ఏపిఎం ,ఆర్ పి ఎస్ ,తో సమన్వయ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ బాలాజీ, డాక్టర్ మధువరన్, డాక్టర్ రాకేష్, డాక్టర్ స్పందన ,డాక్టర్ కళ్యాణ్, మరియు జిల్లాలోని వైద్యాధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *