ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి .
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
కలెక్టరేట్ పరిపాలన అధికారి గన్యాతో కలిసి అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా ఆమె దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు :
పాయం పోతురాజు తండ్రి ముత్యాలు( లేటు) దురదపాడు గ్రామం అశ్వారావుపేట మండలంలోని 2.18 గుంటల భూమి తనకు వారసత్వంలో వచ్చిందని అట్టి భూమిలో తాము తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమ భూమి ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కాలేదని తనకు ధరణి పాస్ బుక్కులు కూడా ఇవ్వలేదని, దయతో తమ వద్ద ఉన్న భూమికి సంబంధించిన పేపర్లు పరిశీలించి ఆన్లైన్లో నమోదు మరియు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయగలరని కోరిన దరఖాస్తును c2 ధరణి సెక్షన్ వారికి పంపనైనది.
కొసగాని శంకర్ తండ్రి రంగయ్య 104 డ్రైవర్ కామేపల్లి గ్రామం మరియు మండలం తాను 16 సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కులు లేకుండా విధులు నిర్వహిస్తున్నానని, 2022లో 1. 80 కోట్ల బడ్జెట్ ఉంచుకొని జీతం వేయనందుకు అప్పటి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినందుకు తనను అకారణంగా 2023 జనవరి ఫిబ్రవరి జీతం ఇవ్వకుండా మార్చి 4వ తారీఖున ఉద్యోగం నుండి తొలగించినారని, ఆనాడు నుండి ఈరోజు వరకు ప్రతి ఒక్క ఉన్నతాధికారికి తన సమస్యను వివరిస్తున్నానని, తాను జీవన ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నామని, మానవతా దృక్పథంతో తన ఉద్యోగం తిరిగి ఇప్పించ గలరని కోరిన దరఖాస్తును, జిల్లా వైద్య శాఖ అధికారికి పంపనైనది.