బి.ఎస్.ఎన్.ఎల్ ను ఆదరించండి .
బి.ఎస్.ఎన్.ఎల్ ను ఆదరించండి .
కొత్తగూడెం: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ ( బి.ఎస్.ఎన్.ఎల్) ను ఆదరించాలని ఏజీఎం జి. సుభాష్ కోరారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లో ఉద్యోగులు, సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకొని బైక్ ర్యాలీని నిర్వహించి వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ ర్యాలీ కొత్తగూడెం డి.ఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు, తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది. వివిధ నెట్వర్క్ నుండి పోర్ట్ అవుట్ చేసుకొని బి.ఎస్.ఎన్.ఎల్ నెట్వర్క్ లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో వినియోగ దారులకు 4జి సిమ్ కార్డును ఉచితంగా అందజేసి వారుకోరుకున్న టారీఫ్ రీఛార్జ్ కే చెల్లిపులు తీసుకుంటున్నామని తెలిపారు.బిఎస్ఎన్ఎల్ సంస్థకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రణాళిక బద్ధంగా, ఉన్నతాధికారుల సూచనలు మేరకు పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎఫ్.టి.టి.హెచ్, ల్యాండ్ ఫోన్ లను ప్రజలకు మరింత చేరువ చేసే పనిలో నిమగ్నమవుతున్నారని తెలిపారు.చౌక ధరలకే తమ మొబైల్ వినియోగ దారులకు 4జి సేవలను అందిస్తుందన్నారు. వినియోగ దారులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.