ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జితేష్
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు తమ ఓటు ద్వారా ఎమ్మెల్సీ ని ఎన్నుకోవాల్సి ఉన్నదని, దానికిగాను ఓటు నమోదు కు గడువు తేదీ ( నవంబర్ 6 )సమీపిస్తున్నందున, ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హత వివరాలు ఉపాధ్యాయుల్లో ఎవరైతే 2018 నవంబర్ ఒకటో తేదీ నుండి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఫామ్ 19 ద్వారా దరఖాస్తు నింపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో కూడా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదుకు జీవో నెంబర్ 49 ద్వారా క్రింద తెలిపిన పాఠశాల ఉపాధ్యాయులు అర్హులు.