Badradrikothagudem

తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి పాదయాత్ర

తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి పాదయాత్ర.

సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినంని పురస్కరించుకుని TGEJAC, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగం వెంకట పుల్లయ్య అధ్యక్షతన చేసిన నిరసన ర్యాలీ కొత్తగూడెం పాత బస్ డిపో నుండి బస్టాండ్ సెంటర్ లో గల అమర వీరుల స్తూపం వరకూ భారీ పాదయాత్ర ను నిర్వహించారు.

స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో జోరు వర్షం లోనూ మానవ హారం ఏర్పరచి ఉద్యోగుల ఆవేదనను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య పక్షా లైన అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక సంఘాలు పాల్గొని మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ను పునరుద్ధరిస్తామని అప్పటి ప్రతిపక్ష, నేటి అధికార పక్ష నాయకులు మరియు ఎన్డీఏ ప్రభుత్వం అధికా వస్తే మీ సమస్యలను పరిష్క రిస్తామని చెప్పిన ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే మా ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి సీపీస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *