పదిమందికి జీవనాధారం కల్పించాలి
పదిమందికి జీవనాధారం కల్పించాలి
పై చదువులు చదువుకొన్న నిరుద్యోగ గిరిజన మహిళలు సమయాన్ని వృధా చేయకుండా తమకు ఇష్టమైన చేతివృత్తుల శిక్షణ తీసుకొని తమ కుటుంబాలను పోషించుకోవడమే కాక పదిమందికి జీవనాధారం కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
పాల్వంచలోని నవభారత్ లోని నవ మహిళ సాధికారక కేంద్రమును సందర్శించి మహిళలకు ఇస్తున్న శిక్షణల గురించి చీప్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. కుట్లు అల్లికలు, పెయింటింగ్ శిక్షణ మరియు బ్యూటీషియన్, తాటాకులతో ఇంటికి అవసరమైన గృహ అహంకరణ వస్తువుల తయారీ శిక్షణ మహిళలతో ఇక్కడ నేర్చుకున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని పదిమందికి ఉపాధి కల్పించేలా చూడాలని అన్నారు. మహిళలు సొంతంగా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి మహిళా సంఘాల ద్వారా లేదా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందుతాయని తప్పనిసరిగా రుణాలు తీసుకొని ఇష్టమైన షాపులు పెట్టుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు.
గిరిజన మహిళలు తమ గ్రామంలోనే షాపులు ఏర్పాటు చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా జీవించవచ్చని, అందుకు శిక్షకులు అందిస్తున్న ఈ శిక్షణను ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ నేర్చుకోవాలని, ఏమైన సందేహాలు ఉంటే మరలా మరలా అడిగి తెలుసుకోవాలని అన్నారు. నవభారత్ తరపున మూడు నెలల శిక్షణ అందించి నెలకు ₹1000 స్కాలర్షిప్ రూపంలో అందించడం చాలా అభినందనీయమని, మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి వివిధ చేతివృత్తులలో శిక్షణ అందించి వారి జీవనోపాధికి తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు.