ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల చర్యలతో భయబ్రాంతులకు గురౌతున్నారు.
ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల చర్యలతో భయబ్రాంతులకు గురౌతున్నారు.
తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్ప అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు తాము అడవులలోనికి వెళ్ళాలంటే మావోయిస్టులు పెట్టిన మందుపాతరల వలన ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,పోలీసులు అట్టి సందేహాస్పద అటవీప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా బూబీ ట్రాప్స్ బయటపడ్డాయి.మావోయిస్టులు గుంతలు త్రవ్వి ఏర్పాటు చేసిన 58 బూబీ ట్రాప్స్ నుంచి 3350 పదునైన కడ్డీలను తొలగించి పోలీసులు వాటిని స్వాదీనం చేసుకోవడం జరిగింది.
ఆదివాసీలకు మంచి చేస్తున్నామని మాయమాటలు చెబుతూ
ఆదివాసీలకు మంచి చేస్తున్నామని మాయమాటలు చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు.తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు.ఆదివాసీలు,జంతువులు సంచరించే ప్రాంతాలలో వారు అమర్చిన IEDs,బూబీ ట్రాప్స్ వలన ఇప్పటికే చాలామంది ప్రాణాలను కోల్పోవడం,తీవ్రంగా గాయాలపాలవ్వడం జరుగుతుంది.కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎదురు కాల్పులు జరిగినప్పుడు నిజనిర్ధారణ పేరుతో హడావిడి చేసే ప్రజాసంఘాలు ఆదివాసీల పట్ల జరిగే అన్యాయాల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు.
జల్ జమీన్ జంగల్
ఆదివాసిల కోసమే మా పోరాటం అంటూ నీతులు వల్లించే మావోయిస్టు నాయకులు సరిహద్దు ప్రాంతాల్ని తమ ఆదీనంలోకి తీసుకుని,ఆ అటవీ ప్రాంతాన్ని ఒక కోటలాగా తయారుచేసుకుని ఎవ్వరూ తమ దగ్గరకు చేరకుండా ఇలాంటి నీచమైన పనులకు తెగబడుతున్నారు.తాము ఉన్న ప్రాంతాలను శత్రు దుర్భేద్యం పేరుతో,పోలీసుల నుండి రక్షణ అని చెప్తూ “జల్ జమీన్ జంగల్” తమవే అనుకుని జీవనం సాగించే అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను నివారించడానికి బూబి ట్రాప్స్,IEDs లను అమర్చుకొని ఆదివాసిల ప్రాంతాల్లో వారికే రక్షణ కరువయ్యేట్లు చేస్తున్నారు.ఇలాంటి కార్యకలాపాలకు పాల్పాడుతూ మావోయిస్టులు వారికి నచ్చిన విధంగా రాజ్యాలు సృష్టించుకొని అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.వ్యవసాయ రీత్యా,అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సంచరించే ఆదివాసీలకు మావోయిస్టులు తీవ్ర నష్టం కలిగేలా చేస్తున్నారు.విద్యా, వైద్యం,రవాణా వంటి సౌకర్యాలను ఆదివాసీలకు అందకుండా మావోయిస్టులు అడ్డుపడుతున్నారు.సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలి.
తెలంగాణ-ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.కావున ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశారు.