భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం.
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం.
జల శక్తి అభియాన్ మరియు జల జీవన మిషన్ కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్.
ఐడిఓసి సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ టెక్నికల్ ఆఫీసర్ రాష్ట్ర జల శక్తి అభియాన్ , జిల్లా అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో ముందుగా జిల్లా కలెక్టర్ జలశక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు తీసుకుంటున్న చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటెషెన్ ద్వారా వ్యసాయ, ఉద్యనవన, ఇరిగేషన్, గ్రామీణభివృద్ధి, తాగునిరు, భూగర్భజలాలు, మహిళసంఘాలు తదితర అంశాలపై కేంద్ర సభ్యులకు వివరించారు.
కేంద్ర సభ్యులు మాట్లాడుతూ క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు . జిల్లాలో ఉన్న నీటి వనరుల ట్యాంకుల సరిహద్దులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మాణం, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, అటవీ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి జలశక్తి అభియాన్ క్యాచ్ థ రైన్ క్యాంపెయిన్ చేపట్టామని అన్నారు. గత 6 సంవత్సరాల కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతుందని, జిల్లాలో కురుస్తున్న వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వర్షపు నీరు వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన పెంచుతున్నామని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విక్రమాల అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకం, నీటి మేనేజ్మెంట్ చర్యలు విస్తృతంగా చేపట్టామని అన్నారు. మహిళా సంఘాలు, , గ్రామసభల ద్వారా గ్రామాలలో నీటి సంరక్షణ పనులను గుర్తించామని పేర్కొన్నారు.