Greenery : పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా.
పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా…
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో మరియు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మరియు పచ్చదనం పెంచడం మే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ అన్నారు.
సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా కొత్తగూడెం లోని రామవరం రామవరం 6 వార్డులో చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ భూమిలో పిచ్చి మొక్కలను మరియు చెత్తను అక్కడి ప్రజలు మరియు అధికారులతో కలిసి తొలగించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యంతో ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజల పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పచ్చదనం పెంచే దిశగా మొక్కలు నాటి వాటి ని పూర్తిస్థాయిలో సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలోతగ్గించాలని సూచించారు. వాడుకలో లేని మరుగుదొడ్లను తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహించిన ప్రభుత్వ భూమిలో అంగన్వాడి కేంద్రం నిర్మించడానికి తగిన ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామాలక్ష్మి,కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషు, ఇరిగేషన్ ఈ ఈ అర్జున్ రావు, కొత్తగూడెం సింగరేణి సివిల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.