మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ , ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ముందుగా లక్ష్మీదేవి పల్లి మండలం అశోక్ నగర్ కాలనీలో సుమారు కోటి 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుకుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామని అన్నారు.
అనంతరం అటవీశాఖ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా లక్ష్మీదేవి పల్లి మండలం చాటకొండ బీట్ లో స్వచ్ఛతనం – పచ్చదనం ముగింపు లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తర్వాత వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవ లక్ష్యాలని అందరూ సాధించాలని తెలిపారు. కొత్తగా పోడు వ్యవసాయం ఎవరు చేపట్టరాదని చేపట్టిన యెడల చర్యలు తప్పవని తెలిపారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు అటవీ శాఖ అధికారులు జామాయిల్ పెంపకం తదితర పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజనులతో స్నేహభావంగా ఉండాలని అన్నారు. గత సంవత్సరం గిరిజనుల దాడిలో మరణించిన శ్రీనివాస్ రేంజర్ కుటుంబ సభ్యులకు 500 గజాల ఇంటి స్థలం పట్టాని రెవెన్యూ మంత్రిగా త్వరలో అందజేస్తామని తెలిపారు.