BadradrikothagudemTelangana

గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలి.

గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలి.

ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల

 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణాల మంజూరు , ప్రగతిపై దాసరి హరిచందనతో  సమీక్షించారు. హైద్రాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఖమ్మం నుండి సూర్యాపేట ఎంట్రీ వద్ధ ఫై ఓవర్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంబించాలన్నారు .

ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల ప్రగతి, ఖమ్మం – దేవరపల్లి ధమ్సలాపూరం వద్ద ఎగ్జిట్ / ఎంట్రీ పాయింట్ల కోసం అయ్యే భూసేకరణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని దానికి అనుగుణంగా NHAI కి లేఖ రాయాలని, తదనుగుణంగా వెంటనే పనులు ప్రారంభమయ్యేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 ధమ్సలాపూరం ఎగ్జిట్ / ఎంట్రీ పాయింట్ ల నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే వెంబడి నూతన కలెక్టరేట్ వరకు సర్వీస్ రోడ్డులను కూడా పూర్తి చేసినట్లయితే ఖమ్మంలో ట్రాఫిక్ నియంత్రణకు మరింత సహకరిస్తుందని తెలిపారు, కావున సర్విస్ రోడ్డులను సత్వరమే మంజూరుచేయాలని కోరారు.

అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఖమ్మం – కురవి రోడ్డు, ఖమ్మం – కోదాడ రోడ్డు పురోగతిపై సమీక్ష చేసారు. నెహ్రూ నగర్ – కొత్తగూడం జాతీయ రహదారి, టెండర్ల దశలో ఉందని, టెండర్ పూర్తికాగానే వాటి నిర్మాణ పనులు మొదలు పెడ్తామని  దాసరి హరిచందన  తెలియజేశారు. చిల్లకల్లు (హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి) క్రాస్ రోడ్డు నుండి బోనకల్లు, వైరా, తల్లాడ నుండి కొత్తగూడం వరకు జాతీయ రహదారి మంజూరు కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని త్వరలోనే మంజూరు అవుతుందని మంత్రి తుమ్మల తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *