జిల్లాను మహిళా శక్తి కి ఆదర్శవంతంగా నిలపాలి.
జిల్లాను మహిళా శక్తి కి ఆదర్శవంతంగా నిలపాలి.
మన జిల్లాను రాష్ట్రంలోనే మహిళా శక్తి కి ఆదర్శవంతంగా నిలపాలి అని కలెక్టర్ జితేష్ తెలిపారు.మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలుపరచాలని తెలిపారు.
మన జిల్లాలో అటవీ సంపద పుష్కలంగా ఉన్నదని దానిని సరైన విధంగా ఉపయోగించుకొని మహిళలు అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు.మహిళా సంఘాలు వారు ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన మరియు ధైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారని తెలిపారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసే చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువుల మార్కెట్ మరియు ప్రజల అవసరమైన వస్తువులు చేయడం ద్వారా విజయం సాధించవచ్చని సూచించారు.
సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్ర రూపొందించుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలైన కూరగాయల పెంపకం మరియు అమ్మకం, బెకరీ, బ్యూటీపార్లర్, కర్రీ పాయింట్, కొబ్బరినూనె తయారీ కేంద్రాలు , హోటల్స్ మరియు కంప్యూటర్ కోచింగ్ సెంటర్లు తదితర చిన్న పరిశ్రమలు స్థాపించడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.