మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలి
ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
మతసామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలి
బక్రీద్ పండుగను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలంతా సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రేపు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మసీదులు,దర్గాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందనారు.బందోబస్త్ విధులకు హాజరయ్యే అధికారులకు,సిబ్బందికి దిశా నిర్దేశం చేశామన్నారు.జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా 07 చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టి ఆవుల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తూ అక్రమ రవాణా జరగకుండా
ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తూ అక్రమ రవాణా జరగకుండా నివారిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలియజేశారు.జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది మొత్తం బక్రీద్ బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు.మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మకూడదని తెలియజేశారు.ముందుగా ఎటువంటి సమాచారం తెలిసినా డయల్ – 100కు ఫోన్ చేసి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలియజేయాలని కోరారు.ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.