మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలి
మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలి
భారీ వర్షాలతో బేంబేలెత్తుతున్న మణుగూరు ప్రజలకు ప్రభుత్వం బాసటగా నిలవాలనీ వరద ముంపును నివారించాలనీ కోరుతూ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన కి మణుగూరు సామాజిక సేవకులు వినతిపత్రం అందజేశారు.
భారీ వర్షాలు అంటేనే మణుగూరు ప్రజల గుండెజారి గల్లంతవుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న కుండ పోత వర్షాలకు మణుగూరు తో పాటు పినపాక నియోజకవర్గం కూడా అతలాకుతలం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మణుగూరుకు వరద ముంపును నివారించాలని ప్రజలకు భరోసా ఇవ్వాలని రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని బాబురావు కోరినట్లు తెలిపారు.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల చాకలి ఐలమ్మ నగర్ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయనీ చినుకు పడితే చాలు రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితి అయినా 108 అంబులెన్స్ రావడానికి కూడా దారి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.