BadradrikothagudemTelangana

ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

 రెండు మరియు మూడు లిఫ్ట్ పంపుల ట్రైలర్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జలయజ్ఞంలో భాగంగా నాడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.

దాన్ని గత ప్రభుత్వం రిలీజ్ అయిన పేరుతో సుమారు తొమ్మిది రెట్ల అధిక విషయంతో 18 వేలకోట్ల వ్యయంతో మొదలుపెట్టి దానికి తల తోక రెండు తెలియకుండా, అక్కడ ఒక గుంట ఇక్కడ ఒక గుంట తొవ్వుకుంటూ పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ సరిచేసి దీనిలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తే బాగుంటుంది.. అనిసుమారు 8000 కోట్ల పైన గత ప్రభుత్వం నిరుపేయోగంగా ఖర్చుపెట్టిన ప్రజల డబ్బును ప్రజలకు ఉపయోగపడే విధంగా సరిచేసి రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు.

పినపాక,అశ్వరావుపేట,సత్తుపల్లి, మధిర, వైరా,పాలేరు మరియు ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం ఈ ప్రాంతాలన్నింటికీ ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకేవలం భద్రాచలం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ మరియు భూసేకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సీజన్ కల్లా సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *